NTV Telugu Site icon

Zika virus: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం..

Zika Virus

Zika Virus

Pune man found Zika virus positive: ప్రపంచం గత మూడేళ్లుగా కరోనా వైరస్ తో కష్టాలు పడుతోంది. దీనికి తోడు ఇటీవల మంకీపాక్స్ వైరస్ కూడా ప్రపంచాన్ని కలవరపెట్టింది. భారత్ లో కూడా పదికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి జికా వైరస్ కలవరం మొదలైంది. మహరాష్ట్రలో ఓ వ్యక్తితో జికా వైరస్ గుర్తించారు. పుణేలోని బవ్‌ధాన్ ప్రాంతంలో 67 ఏళ్ల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.

నాసిక్ నివాసి సదరువ్యక్తి నవంబర్ 6న పూణేకు వచ్చాడు. నవంబర్ 16న అతనికి జ్వరంతో పాటు దగ్గు, కీళ్ల నొప్పులు, అలసట లక్షణాలతో స్థానిక జహంగీర్ ఆస్పత్రిలో చేరాడు. ఈ నేపథ్యంలో ఆయన శాంపిళ్లను ల్యాబ్ కు పంపించగా.. నవంబర్ 18న జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగానే ఉన్నాట్లు, ఎటువంటి సమస్యలు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also: Viral News: అదిరిపోయే జాబ్ ఆఫర్.. ఎలుకలను పట్టుకుంటే రూ.1.38 కోట్లు

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో జికా వైరస్ కేసు నమోదు అయినట్లు వెల్లడిచింది. నవంబర్6న పూణేకు సదరు వ్యక్తి వచ్చాడని.. అంతకుముందు అక్టోబర్ 22న సూరత్ వెళ్లాడని, నవంబర్ 30న అతనిలో జికా వైరస్ సోకినట్లు నిర్దారణ అయిందని వెల్లడించింది. భవిష్యత్తులో పూణేలో వ్యాధి వ్యాప్తి చెందకుండా నగరం అంతా ఎంటమోలాజికల్ సర్వే చేస్తామని వెల్లడించింది. 2016లో బ్రెజిల్ దేశంలో వెలుగులోకి వచ్చిన జికా అక్కడ వేగంగా వ్యాపించింది.

ప్రధానంగా ఏడెస్ దోమ నుంచి ఈ వైరస్ సంక్రమిస్తుంది. తేలికపాటి జ్వరం, శరీరంపై దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వ్యాధి ప్రధాన లక్షనాలు. ఇది నవజాత శిశువుల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జికా సిండ్రోమ్ కలిగిస్తుంది. 1947లో ఉగాండాలోని జికా అడవిలో ఈ వైరస్ కనుగొన్నారు. అప్పటి నుంచిచ ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవుల్లో జికా వైరల్ వ్యాప్తి ఉంది.