Site icon NTV Telugu

Grandma Complaints:ఓట్ల కోసం ఇంటికి వచ్చిన నేతలు.. వెరైటీ కోరిక కోరిన వృద్ధురాలు…

Untitled Design (1)

Untitled Design (1)

ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కాలక్షేపం అంటే ఎక్కువగా సీరియల్స్ అనే చెప్పుకోవాలి.. వాళ్లకు నచ్చిన సీరియల్ వచ్చిదంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా.. వారు ఆ సీరియల్ నుంచి బయటికి రారు.. ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే.. కానీ బీహార్ లో ఎన్నికల ఓట్ల కోసం వచ్చిన నాయకులతో ఓ బామ్మ ఓ వింత కోరిక కోరింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.

Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు…

టీవీ సీరియల్ లో ఎక్కువగా యాడ్స్ వస్తున్నాయని.. ఆ నాయకులకు ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది తెగ వైరల్ అవుతుంది. పూణే పర్యటన సందర్భంగా ఆ మహిళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్, బారామతి ఎంపీ సుప్రియా సులేను కలిసింది. అక్కడ, ఆమె అధికారుల ముందు ఈ విషయాన్ని లేవనెత్తింది.

భారతదేశంలో టీవీ సీరియల్స్‌కు ఫిదా అయిపోయి.. టీవీలకు అతుక్కుపోయి.. డిస్టర్బెన్స్ జరిగితే గొడవలు పడిపోయి.. ఒక్కోసారి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆడాళ్లు టీవీ సీరియల్స్‌ను ఓన్ చేసుకుని.. ఆ సీరియల్ చూసే టైంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు డిస్టర్బ్ చేసినా.. ఫట్టుమని ఒక్కటి వేసేందుకు కూడా వెనుకాడరు.

Read Also:Pepper Spray: నిన్న మొన్నటి దాకా బస్సులోనే అనుకున్నాం.. ఇప్పుడు ట్రైన్ లో కూడానా…

బీహార్‌కు చెందిన ఓ బామ్మ.. తన టీవీ సీరియల్స్‌కు యాడ్స్ ఎలా అడ్డుపడుతున్నాయో.. ఓట్ల కోసం వచ్చిన నాయకులకు చెప్పింది. ఎన్‌సీపీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే పూణే రస్తా పేఠ ప్రాంతంలో ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఇక్కడ ఓ బామ్మ.. 30 నిమిషాలు టీవీ సీరియల్ ఉంటే ఇందులో 20 నిమిషాలు యాడ్స్ వస్తాయని.. కథ చూడటానికి ఏం లేదని.. దయచేసి ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయమని కోరింది. ఆమె ప్రాబ్లమ్‌ను చక్కగా విన్న ఎంపీ.. ఏదో ఒకటి చేస్తామని హామీ ఇచ్చింది.

Exit mobile version