
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కరోనా బారిన పట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ కూటమి నుంచి రంగస్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నాలుగురోజుల క్రితం ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాలలో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో రంగస్వామికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈనెల 7 వ తేదీన రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుగా ఆ కార్యక్రమానికి హాజరైనవారిలో మరో 11 మందికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం రంగస్వామి చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.