Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన భార్య ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, సౌత్ లాబీకి ప్రయోజనం చేకూరే విధంగా పాలసీని రూపకల్పన చేశారని, దీంట్లో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టు ముందు వెల్లడించింది.
అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే అని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. దీనిని ‘‘ఢిల్లీ ప్రజలకు ద్రోహం’’గా అభివర్ణించారు. ‘‘మీ ముఖ్యమంత్రి మీ వెంటే ఉన్నారు. లోపలైనా, బయటైనా ఆయన జీవితం దేశానికి అంకితం. ప్రజలకు అన్నీ తెలుసు’’ అని ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మోడీ అధికార దురహంకారంతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
Also Read
Read Also: Sridevi Vijay Kumar: దానికి అలవాటు పడడానికి టైమ్ పట్టింది.. అందుకే సినిమాలకు దూరం
అంతకుముందు అరెస్టు తర్వాత కేజ్రీవాల్ కోర్టుకు తీసుకుళ్తున్న సమయంలో ‘‘నా జీవితం దేశానికి అంకితం’’ అని అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో సహా ఇప్పటి వరకు ఆప్‌కి చెందిన నలుగురు నేతలు అరెస్టయ్యారు. ఇదే కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ ఇప్పటికే జైలులో ఉన్నారు. మరోవైపు జైలులో ఉన్నప్పటికీ ఆయన సీఎంగా తన విధులు నిర్వహిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయవచ్చు కానీ, ఆయన ఆలోచనలను అరెస్ట్ చేయలేరంటూ వారు ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
आपके 3 बार चुने हुए मुख्यमंत्री को मोदीजी ने सत्ता के अहंकार में गिरफ़्तार करवाया।सबको crush करने में लगे हैं। यह दिल्ली के लोगो के साथ धोखा है।आपके मुख्यमंत्री हमेशा आपके साथ खड़े रहें हैं।अंदर रहें या बाहर, उनका जीवन देश को समर्पित है।जनता जनार्दन है सब जानती है।जय हिन्द🙏
— Sunita Kejriwal (@KejriwalSunita) March 22, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు