Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన భార్య ఏమన్నారంటే..?

Sunita Kejriwal

Sunita Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, సౌత్ లాబీకి ప్రయోజనం చేకూరే విధంగా పాలసీని రూపకల్పన చేశారని, దీంట్లో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టు ముందు వెల్లడించింది.

అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే అని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. దీనిని ‘‘ఢిల్లీ ప్రజలకు ద్రోహం’’గా అభివర్ణించారు. ‘‘మీ ముఖ్యమంత్రి మీ వెంటే ఉన్నారు. లోపలైనా, బయటైనా ఆయన జీవితం దేశానికి అంకితం. ప్రజలకు అన్నీ తెలుసు’’ అని ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మోడీ అధికార దురహంకారంతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

Read Also: Sridevi Vijay Kumar: దానికి అలవాటు పడడానికి టైమ్ పట్టింది.. అందుకే సినిమాలకు దూరం

అంతకుముందు అరెస్టు తర్వాత కేజ్రీవాల్ కోర్టుకు తీసుకుళ్తున్న సమయంలో ‘‘నా జీవితం దేశానికి అంకితం’’ అని అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో సహా ఇప్పటి వరకు ఆప్‌కి చెందిన నలుగురు నేతలు అరెస్టయ్యారు. ఇదే కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ ఇప్పటికే జైలులో ఉన్నారు. మరోవైపు జైలులో ఉన్నప్పటికీ ఆయన సీఎంగా తన విధులు నిర్వహిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయవచ్చు కానీ, ఆయన ఆలోచనలను అరెస్ట్ చేయలేరంటూ వారు ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version