NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రి విధ్వంసం గురించి పోలీసులకు తెలియదా..? ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఘటన జరిగిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. కోల్‌కతా పోలీసుల వైఫల్యంతో ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ప్రభుత్వ యాజమాన్యంలో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆగస్టు 9న లేడీ డాక్టర్ దారుణంగా హత్యకు గురైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారు. శుక్రవారం తెల్లవారుజామున కాలేజీ సెమినార్ హాలులో ఆమె మృతదేహం నగ్నంగా కనిపించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంలో 150‌ మిల్లిగ్రాముల వీర్యం దొరకడంతో ఇది సామూహిక అత్యాచారంగా బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టుకి తెలిపారు.

ఇదిలా ఉంటే, గురువరాం ‘‘రిక్లెయిమ్ ది నైట్’’ పేరుతో బాధితురాలికి న్యాయం జరగాలని వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఆస్పత్రి ముందు నిరసన తెలిపిన సమయంలో, ఓ గుంపు ఆస్పత్రికలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడింది. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంలో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారు.

తాజాగా ఈ విధ్వంసంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యం” విధ్వంసానికి దారితీసిందని చెప్పింది. రాష్ట్ర పోలీసుల వైద్య సదుపాయాలను, అక్కడ పనిచేస్తున్న వైద్యుల్ని రక్షించలేకపోతే దానిని మూసేయాలంటూ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముందస్తు ప్రణాళికతో జరిగిన విధ్వంసంపై మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

Read Also: National Film Awards: బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి.. బెస్ట్ మూవీగా ఆట్టం.. నేషనల్ అవార్డు విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే

విధ్వంసం గురించి రాష్ట్రం తరుపున కోర్టుకు విన్నవిస్తూ.. సుమారు 7000 మంది గుంపు వచ్చిందని, ఆ సంఖ్య అకాస్మత్తుగా పెరిగిందని, తమ దగ్గర వీడియోలు ఉన్నాయని, వారు బారికేడ్లు బద్దలు కొట్టారని, టియర్ గ్యాస్ ప్రయోగించామని, 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పింది. అయితే, వారి వాదనల్ని విన్న కోర్టు.. పోలీసులకు తెలియకుండా ఈ ఘటన జరిగిందని నమ్మడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. ఇంత అస్థిరమైన అంశంపై ప్రజా నిరసనలకు ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం డిమాండ్ చేసింది.”సాధారణంగా పోలీసులకు ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది… హనుమాన్ జయంతి రోజున ఇలాంటివి జరిగాయి. 7,000 మంది గుమిగూడితే, పోలీసులకు తెలియదని నమ్మడం కష్టం.” అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాదనల్ని కోర్టు తీవ్రంగా ఖండించింది.

మీరు చర్యలు తీసుకుంటున్నారా..? నివారణ చర్యలు ఏమిటి..? అని కోర్టు ప్రశ్నించింది. బాధితురాలి తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది బికాష్ రంజన్ భట్టాచార్య, పోలీసులు నిరసనకారుల వెనక దాక్కున్నారు అని వాదించారు. విధ్వంసం నుంచి క్రైమ్ సీన్‌ని కాపాడలేకపోయారని పోలీసులపై ఆరోపించారు. విధ్వంసానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనలకు సంబంధించి అన్ని విషయాలను సీబీఐకి ఇవ్వాలని కోల్‌కతా పోలీసులను కోర్టు ఆదేశించింది.