పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు జీవం పోసింది వైఎస్ఆర్ అని.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దేనని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…పోలవరం కు 55 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
read also : సీఎం కేసీఆర్ ఓ హిట్లర్ : మాణికం ఠాగూర్
29 నెలలు గడిచినా ఇంకా పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించలేదని.. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని రాజమండ్రి కి తరలించాలని కోరారు. లోకసభ లో మేము వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చామని… పోలవరం ప్రాజెక్ట్ పై వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మానలు ఉభయసభల్లో తిరస్కరించారని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆందోళన చేస్తామన్నారు.
