సీఎం కేసీఆర్ మరో హిట్లర్ : మాణికం ఠాగూర్

సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని… రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా రేవంత్ ను అడ్డుకున్నారని… ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ కు వచ్చే సభ్యుడిని అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కి ఉన్న ప్రజాస్వామ్య హక్కులను టిఆర్ఎస్ కాలరాస్తుందని…తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణను 100 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించిందని తెలిపారు. రేవంత్ అక్రమ అరెస్ట్ ను లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-