NTV Telugu Site icon

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలోకి మోడీ ఎంట్రీ.. సభ ముందుకు రానున్న మహిళా బిల్లు..

New Parliament

New Parliament

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలోకి ఎంపీలంతా ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోడీ కేంద్రమంతులు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషిలతో పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు కొత్త పార్లమెంట్ భవనంలో సభకు హాజరయ్యారు.

ఆధునికతకు అద్దం పట్టేలా, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం ప్రతీకగా నిలుస్తుందని, వినాయక చతుర్థి రోజున పార్లమెంట్ భవనంలోకి వచ్చామని, సభ్యులందర్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్రను ప్రతిబింబిచేలా కొత్త పార్లమెంట్ ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అజాదీకా అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పనిచేయాలని సూచించారు. నెహ్రూ చేతికి శోభనిచ్చిన సెంగోల్ కొత్త పార్లమెంట్ లో ఉందని ఆయన అన్నారు.

Read Also: Parliament Sessions : పాత పార్లమెంట్‌‌కి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోడీ.. ఏంటంటే..?

కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ కార్యకలాపాలకు ముందు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ..ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో చాలా ముఖ్యమైన రోజని, కొత్త పార్లమెంట్ లో లోక్‌సభ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని, దీనికి సాక్ష్యంగా నిలిచే అదృష్టం మనకు కలిగిందని, ఈ చారిత్మాత్మక రోజు మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకురాబోతోంది. సోమవారం క్యాబినెట్ మహిళా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మెఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు.