Site icon NTV Telugu

Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్‌కతాలో ల్యాండింగ్..

Air India

Air India

Air India flight: టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI357 విమానంలో ప్రయాణికులు, సిబ్బంది క్యాబిన్ లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు.

Read Also: Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..

ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో.. విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని పరకటించింది. ప్రస్తుతం, విమానానికి సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయి. కోల్‌కతాలోని గ్రౌండ్ సిబ్బంది ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని మరియు వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఎయిర్‌లైన్ పేర్కొంది.

Exit mobile version