NTV Telugu Site icon

Pakistani Youtuber: “ఇండియా కంటెంట్‌పై మమ్మల్ని కిడ్నాప్ చేశారు”.. బతికే ఉన్న పాక్ యూట్యూబర్లు..

Pakistani Youtuber

Pakistani Youtuber

Pakistani Youtuber: పాకిస్తాన్ యూట్యూబర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రో-ఇండియా కంటెంట్ చేసే ప్రముఖ యూట్యూబర్ల అయిన సనా అమ్జాద్, సోయబ్ చౌదరిలు గత 21 రోజులుగా కనిపంచలేదు. వీరిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కిడ్నా్ప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వీరే కాకుండా 10 మందికి పైగా యూట్యూబర్లు గత కొన్ని వారాలుగా పత్తా లేకుండా పోయారు. సనా అమ్జాద్, చౌదరిను అక్కడి ప్రభుత్వం ఉరి తీసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు ఆన్‌లైన్‌లోకి వచ్చారు. తాజాగా వీరి వీడియోలు యూట్యూబ్‌లో కనిపించాయి. ఇన్నాళ్లు వీరికి ఏమైందా అని అటు పాకిస్తాన్‌లో ఇటు భారత్‌ నెటిజన్లలో ఆందోళన నెలకొంది.

Read Also: Balasaheb Thackeray: హిందుత్వ విషయంలో బాలాసాహెబ్ రాజీ పడలేదు: పీఎం మోడీ..

తాము భారతీయ అనుకూల కంటెంట్ చేస్తున్నామని చెబుతూ ఒక రాజకీయ సమూహం తమను కిడ్నాప్ చేసిందని వీరిద్దరు అసలు విషయాన్ని వెల్లడించారు. తమ కంటెంట్‌ని ఆపాలని తమపై ఒత్తిడి చేశారని, తమను కిడ్నాప్ చేసి హింసించినట్లు వీరిద్దరు చెప్పారు. “తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, సాయుధులైన వ్యక్తులు నా ఇంటికి చొరబడి, నా కళ్ళకు గంతలు కట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. వారు నన్ను 3 వారాల పాటు హింసించారు” అని సోయబ్ చౌదరి చెప్పారు. ‘‘ నేను వారికి బహిరంగ సవాల్ చేస్తున్న.న నేను ఎవరికి భయపడను. ఎవరైనా పాకిస్తాన్‌కి హాని చేస్తుంటే, చట్టపరిధిలోనే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతా’’ అని అన్నారు.

సనా అమ్జాద్ కూడా తన బాధకరమైన పరిస్థితిని పంచుకుంది. తనను సైలెంట్ చేసేందుకు తన కుటుంబాన్ని బెదిరించారని, తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా తన తల్లిని హింసించారని ఆమె ఆరోపించింది. సనా అమ్జాద్ భారత ప్రగతి, అభివృద్ధిని ప్రశంసిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారత్ పరపతి, మోడీకి దక్కే గౌరవం గురించి యూట్యూబ్ కంటెంట్ చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని కాంక్షించింది. ఒకానొక సమయంలో మోడీని ‘‘సింహం’’ అంటూ ప్రశంసించారు. ఒకేసారి 1947లో స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల్లో, భారత్ అభివృద్ధి చెందుతుంటే, పాకిస్తాన్ ఎందుకు అప్పులపాలైందని తన వీడియోల్లో ప్రశ్నించింది.