Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: MLC Kavitha: దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తా.. కానీ టైం కావాలీ..
వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్వి ప్రియాంకాగాంధీ పీఏ సందీప్ కుమార్ తనను చంపుతాడని బెదిరించాడని అర్చనా గౌతమ్ ఆరోపించారు. 2023 ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ఈ కార్యక్రమానికి అర్చనా గౌతమ్ ను ఆహ్వనించింది కాంగ్రెస్. అయితే ఈ సమావేశంలో అర్చనా తనకు ప్రియాంకాగాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె పీఏను కోరారు. అయితే ప్రియాంక గాంధీకి అర్చనను పరిచయం చేసేందుకు సందీప్ కుమార్ నిరాకరించాడని.. అర్చనతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు కులపరమైన పదాలు, అసభ్యకరమైన పదజాలం వాడాడని.. అంతే కాకుండా చంపేస్తానని బెదిరించాడని గౌతమ్ బుద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన కుమార్తెను చంపేస్తానని, కులం పేరుతో తిట్టారని అర్చనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అర్చనా ఫేస్ బుక్ లో తెలిపారు. ఈ విషయమై మీరట్ సిటీ ఎస్పీ పీయూష్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 యూపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.