Priyanka Gandhi: ఇది ప్రజాస్వామ్య విజయం.. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టామన్న ప్రియాంకాగాంధీ
- అధికారంపై బీజేపీ కుట్ర పన్నింది
- అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాం
- ఇది ప్రజాస్వామ్య విజయం అన్న ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. ఆ కుట్రను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయని వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఢిల్లీలో మీడియాతో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిన్నటి ఘటనతో రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు.
ఇది కూడా చదవండి: Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్
ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.
#WATCH | Congress MP Priyanka Gandhi Vadra holds a press conference over the Constitution (131st Amendment) Bill failing to pass in the Lok Sabha.
She says, "What happened yesterday was a huge victory for democracy. The government's conspiracy to alter the federal structure and… pic.twitter.com/8HVGHFGeIH
— ANI (@ANI) April 18, 2026
తాజావార్తలు
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?