యూపీలో కాంగ్రెస్ ఘోరంగా పతనమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. 403 స్థానాలకు పోలింగ్ జరగగా 400 చోట్ల హస్తం తరఫున అభ్యర్థులు పోటీ చేశారు. అయితే కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉన్న ప్రియాంకా గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి తీవ్రంగా శ్రమించినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు.
కాగా మరోవైపు యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గంతో బీజేపీకి ఉన్న సీట్లు 280 నుంచి 266కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ పార్టీకి గతంలో ఉన్న 121 సీట్లు.. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు 132 సీట్ల లీడ్ కనిపిస్తోంది. 100 సీట్లలో 500 ఓట్ల తేడాతో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. రౌండ్లు పెరుగుతున్న కొద్దీ అంకెల్లో మార్పులు కనిపించవచ్చు.
