NTV Telugu Site icon

Wayanad bypoll: వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు

Priyanka

Priyanka

Wayanad bypoll:కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయానాడ్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రియాంకా తన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇక, నామినేషన్ కు ముందు వయానాడ్ కల్ఫేటాలో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి మెగా ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకా గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్న ఖర్గే సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read Also: YS Jagan Visit Sahana Family: సహన కుటుంబానికి జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై ఫైర్‌.. వైసీపీ నుంచి పరిహారం ప్రకటన..

అయితే, రాహుగాంధీ రాయ్ బరేలీ, వయానాడ్ లో రెండు చోట్ల లోక్ సభ ఎన్నికల్లో గెలవడంతో ఆయన వయానాడ్ స్థానానికి రిజైన్ చేయడంతో ఇక్కడ బై పోల్స్ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామాతో వయానాడ్ బరిలో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే ఫస్ట్ టైం. ప్రియాంకకి యూడీఎఫ్ సపోర్ట్ ఇస్తుంది. వయానాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో భాగంగా నవంబర్ 13న పోలింగ్, 23న తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎల్డీఎఫ్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా సత్యన్ మొఖేరీ, బీజేపీ క్యాండిడెట్ గా నవ్య హరిదాస్ ఎన్నికల బరిలో నిలిచారు.