Site icon NTV Telugu

PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోడీ

Moditour

Moditour

ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు వెళ్లారు. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ సౌదీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. గత దశాబ్ద కాలం నుంచి భారత్‌తో సౌదీ అరేబియా సంబంధాలు బలంగా ఉన్నాయి. మరోసారి ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. అలాగే భారతీయులతో కూడా మోడీ సంభాషించనున్నారు.

ఇది కూడా చదవండి: Ponnala Lakshmaiah: మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. నిందితుల అరెస్ట్

ఇక మోడీ మూడోసారి అధికారం చేపట్టాక సౌదీ అరేబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2016, 2019లో రెండు సార్లు సౌదీ అరేబియాలో పర్యటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఇదే మొదటి పర్యటన. ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ పశ్చిమాసియాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సౌదీలో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: Amardeep : బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా కొత్త సినిమా

 

Exit mobile version