Site icon NTV Telugu

PM Modi: వారణాసి గ్యాంగ్‌రేప్ ఘటనపై మోడీ ఆరా

Modipm

Modipm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు, కలెక్టర్‌తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు.

ఇది కూడా చదవండి: PM Modi: అమెరికాకు వ్యతిరేకంగా స్వరం పెంచండి.. తహవ్వూర్ రాణాపై మోడీ పాత పోస్ట్ వైరల్

మార్చి 29న కొంత మంది యువకులతో యువతి బయటకు వెళ్లింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు.. యువతిని గుర్తించినప్పుడు.. సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై, 11 మంది పేరులేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహైల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్‌లుగా గుర్తించారు.

మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే.. అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: Amit Shah: కాసేపట్లో తమిళనాడుకు అమిత్ షా.. కొత్త బీజేపీ చీఫ్ పేరు ప్రకటించే ఛాన్స్!

Exit mobile version