NTV Telugu Site icon

PM Modi: రాహుల్‌గాంధీపై మోడీ విమర్శలు.. ఆ నేతలకు పేదలంటే గిట్టదని సెటైర్లు

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్‌ చేస్తారని.. అదే సభలో పేదల గురించి మాట్లాడితే మాత్రం విసుగ్గా చూస్తారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తామని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించామని… 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామన్నారు. అలాగే ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఎన్నికల్లో తప్పుడు హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: NBK 111: గోపీచంద్ తోనే బాలకృష్ణ నెక్స్ట్.. అంతా సెట్!

గతంలో స్కామ్‌లు గురించి వినేవాళ్లమని.. కానీ ఇప్పుడు స్కామ్‌లు లేవు అని చెప్పారు. ప్రపంచ గేమింగ్‌ రాజధానిగా భారత్‌ మారుతోందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయని.. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుతుందని.. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణమని.. రాజ్యాంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Jr NTR: నాకోసం ఎవరూ పాదయాత్ర చేయొద్దు.. నేనే మీ అందరినీ కలుస్తా!