Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు..

President's Rule

President's Rule

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణ కారణంగా ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్తగా ఎవరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. దీంతో కేంద్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: CM Yogi Adityanath: ఎంతకు తెగించార్రా.. యోగికే “టోపీ” పెడతారా..

‘‘గవర్నర్ నుంచి నివేదిక అందిన తర్వాత, ఇతర సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని నేను సంతృప్తి చెందాను’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత సీఎం అభ్యర్థిపై బీజేపీ ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది.

మణిపూర్‌లో మెయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి బీరెన్ సింగ్‌ని తొలగించాలని, అతను ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలే అతడిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అవిశ్వాసం ప్రవేశపెడితే సొంత పార్టీ నేతలు విప్ ధిక్కరించి, బీరెన్ సింగ్‌కి వ్యతిరేకంగా ఓటేస్తారనే సమాచారం ఉండటంతో, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

Exit mobile version