భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇక, కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు వేయనున్నారు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు..
-
చివరిగా ఓటేసింది ఎవరంటే..?
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పీపీఈ కిట్లు వేసుకుని వచ్చి ఓట్లేశారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్. చివరగా ఓటేశారు స్పీకర్ ఓం బిర్లా
-
ముగిసిన ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు.
పార్లమెంట్ భవనంలో పూర్తయిన ఓటింగ్ ప్రక్రియ.
జులై 21 న ( గురువారం) ఓట్ల లెక్కింపు.
జూలై 25 న (సోమవారం) నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం.
-
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
తెలంగాణ లో ఓట్లు 119 .. ఓటేసిన ఎమ్మెల్యే లు 117
ఓటుకు దూరంగా మంత్రి గంగుల కమలాకర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్
కరోనాతో మంత్రి గంగుల ఓటింగ్ కు దూరం
తెలంగాణలో ఓటేసిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డీ
-
ఓటేసిన జగ్గారెడ్డి
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
-
ద్రౌపది ముర్ముకి ఓటేశాం
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము కు మద్దతు ఇచ్చాం అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ దనకర్ కు మద్దతు ఇస్తాం. పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టాలని తీర్మానం చేసిన ఒకే ఒక్కడు జగన్. హామీలు ఇవ్వటం కాదు, ఆచరణ చేసి చరిత్ర సృష్టించారు జగన్ అన్నారు కృష్ణయ్య.
-
పార్లమెంట్ భవనంలో 90 శాతం పోలింగ్
భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ వేగంగా సాగుతోంది. 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది, పార్లమెంట్ భవనంలో ఇప్పటివరకు 90 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ లో పాల్గొన్న ఎంపీల సంఖ్యను అధికారికంగా ప్రకటించనున్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు.
-
ఓటు వేయని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు టీడీపీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఏపీ అసెంబ్లీ హాల్ ఒకటి లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో ఓటు వేయడానికి ఆయనకు ఈసీ అనుమతి మంజూరు చేసింది. దీంతో ఆయన హైదరాబాద్ లో ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఓటేశారు.
-
చివరిగా ఓటు వేయనున్న మంత్రి గంగుల
కాసేపట్లో అసెంబ్లీ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న జగ్గారెడ్డి. ఐదు గంటల వరకు పోలింగ్. ఆఖరి నిమిషంలోకో ఓటు వేయనున్న మంత్రి గంగుల కమలాకర్. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని జర్మనీ లో వుండడంతో ఆయన ఓటు వేయడం లేదు. కాసేపట్లో అసెంబ్లీ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి
-
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని బాలయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి
విదేశీ పర్యటనలో ఉండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్), నందమూరి బాలకృష్ణ (హిందూపురం) రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో.. తన ఏరియల్ సర్వేను ముగించుకుని.. హైదరాబాద్ చేరుకున్నారు.. నేరుగా అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశారు.. ఆయన వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చారు..
-
తన ఓటుపై క్లారిటీ ఇచ్చిన సీతక్క..
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క ఓటుపై కొంత గందరగోళం నెలకొంది.. అయితే, నేను ఓటు సరిగానే వేశా.. మేం అనుకున్న అభ్యర్థికే ఓటు వేశానని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. అయితే, బ్యాలెట్ పేపర్‌పై పెన్ మార్క్ పడింది, ఓటు చెల్లుబాటు అవుతుందో.. లేదో అని ఇంకో బ్యాలెట్ పేపర్ అడిగాను.. అంతే తప్ప.. అందులో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు సీతక్క
-
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు టీమ్
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ శాసనసభ్యులు కె. అచ్చెన్నాయుడు, ఎన్.రామానాయుడు, గద్దె రామ్మోహన్రావు, గంటా శ్రీనివాసరావు, ఎన్. చినరాజప్ప, పయ్యావుల కేశవ్, ఆదిరెడ్డి భవాని తదితరులు ఓటు వేశారు..
-
పోలింగ్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. ఇవాళే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో.. నామా నాగేశ్వరరావు, కేకే.. సహా టీఆర్ఎస్ ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు..
-
ఓటుహక్కు వినియోగించుకున్న కేటీఆర్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.. కేటీఆర్ ఓటుతోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రారంభమైన పోలింగ్
-
ఓటు వేసిన భట్టి విక్రమార్క
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తన ఓటుహక్కు వినియోగించుకున్నారు..
-
ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు..
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తన ఓటుహక్కు వినియోగించుకున్నారు..
-
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. టీడీపీ కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
సీతక్క ఆయోమయం..!
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. కాస్త ఆయోమయానికి గురయ్యారు.. బ్యాలెట్ తీసుకుని ఓటు వేసేందుకు వెళ్లిన ఆమె.. డ్రాప్ బాక్స్‌లో మాత్రం బ్యాలెట్ పేపర్ వేయలేదు.. ఆమె ఏదో కన్‌ఫ్యూజన్‌కు గురైనట్టు తెలుస్తోంది.. మరో బ్యాలెట్ పేపర్ కావాలని సీతక్క అడిగినట్టు తెలుస్తోంది.. ఫైనల్ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.
-
ఓటు వేసిన 135 మంది ఎమ్మెల్యేలు..
రాష్ట్రపతి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది.. పార్లమెంట్ ఆవరణలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేస్తే.. రాష్ట్రాల్లో సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తున్నారు.. ఇక, ఏపీలో ఉదయం 11.40 గంటల వరకు 135 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. వీరంతా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే
-
తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేసిన ఏపీ ఎమ్మెల్యే..
రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును తెలంగాణ అసెంబ్లీలో వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.. కాసేపటి క్రితం తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి.. ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
టీడీపీ ఆఫీసులో మాక్ పోలింగ్..
టీడీపీ ఆఫీసులో రాష్ట్రపతి ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహించారు.. ఓటెలా వేయాలనే దానిపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు.. మోడల్ బ్యాలెట్ పేపర్ ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఏక్ నాథ్ షిండే
-
వీల్ చైర్‌లో ఓటేసేందుకు వచ్చిన మన్మోహన్‌సింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది.. పార్లమెంట్‌లో ఓటు వేసేందుకు వీల్ చైర్ లో వచ్చారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
-
ఓటు వేసిన ప్రధాని మోడీ..
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ... పార్లమెంట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
-
ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్... తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి బస్సుల్లో చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రాష్ట్రపతి ఎన్నికల్లో మొదట ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
-
ఓటు వేసిన సీఎం జగన్
-
ఓటు వేసిన సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని
రాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు వేశారు. ఆయనతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
-
ఎంపీ ఓటు విలువ 708.. ఎమ్మెల్యేదీ..!
రాష్ట్రపతి ఎన్నికకు ఎంపీలు-776, ఎమ్మెల్యేలు 4,033 మొత్తం ఓటర్లు-4,809 మంది. అయితే ఎంపీ ఓటు విలువ 708, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది. ఏపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132 గా ఉంది.
-
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
-
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించిన కేటీఆర్, బస్సుల్లో అసెంబ్లీకి బయల్దేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు