Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మధ్యప్రదేశ్‌కు చెందినవారే..!

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

“గిరిజన సమాజానికి చెందిన సోదరి” అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఎ నామినేట్ చేసిందని, ఆమె ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాజ్యాంగ పదవికి ఎన్నికైందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “ఇది చాలా గర్వించదగిన క్షణం” అని ట్విట్టర్‌ వేదికగా చౌహాన్ అన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో 17 మంది ఎంపీలు, 104 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వీరిలో అత్యధికులు మధ్యప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారని అంచనా వేస్తున్నారు. కాగా.. ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 64 ఏళ్ల ముర్ము, రామ్ నాథ్ కోవింద్ తర్వాత దేశ 15వ రాష్ట్రపతి అయ్యేందుకు ఎలక్టోరల్ కాలేజీతో కూడిన ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపులో 64 శాతానికి పైగా చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందిన తర్వాత సిన్హాపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.

Exit mobile version