NTV Telugu Site icon

Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!

Murmu

Murmu

Droupadi Murmu: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ఈ రథయాత్ర సందర్భంగా పూరీకి వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూరీ బీచ్‌లో మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా.. జీవిత సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే.. మనం ప్రకృతిలో భాగమని గుర్తు చేసే ప్రదేశాలు ఉన్నాయని ఆమె బీచ్ గురించి ఎక్స్ వేదికగా ట్విట్ట్ చేసింది. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనస్సును ఆకర్షిస్తాయన్నారు. ఈ రోజు సముద్ర తీరం వెంట నడుస్తుంటే, పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం, ఇది ఒక ధ్యాన అనుభవం అని ద్రౌపది ముర్ము తెలిపారు.

Read Also: Bus Accident : హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు

కాగా, శ్రీ జగన్నాథ్‌ని దర్శనం చేసుకున్నప్పుడు, నేను ప్రగాఢ అంతర్గత శాంతిని అనుభవించాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను అని చెప్పారు. మన బిజీ వర్క్ తో ప్రకృతితో ఉన్న ఈ అనుబంధాన్ని కోల్పోతున్నామన్నారు. మానవజాతి ప్రకృతిపై పట్టు సాధించింది.. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని దోపిడీ చేస్తోంది.. దాని ఫలితం అందరూ చూడాల్సిందే అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.

Read Also: Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..

అయితే, ఈ వేసవిలో భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన వేడి గాలులను ఎదుర్కొన్నాయి.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణంలో మార్పుల వల్ల విపరీతమైన అనర్థాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాబోయే దశాబ్దాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అని రాష్ట్రపతి హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సముద్ర మట్టాల పెరుగుదలకు దారి తీస్తోంది అని పేర్కొన్నారు. తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది.. అలాగే, మహాసముద్రాలు, అక్కడ కనిపించే వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం వివిధ రకాల కాలుష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.