Site icon NTV Telugu

Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి

Jagdeep Dhankhar1

Jagdeep Dhankhar1

జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. సోమవరం అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖర్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. మంగళవారం ధన్‌ఖర్ రాజీనామా ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ధన్‌ఖర్ రాజీనామా తర్వాత ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. ధన్‌ఖర్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: UP: సినిమా తరహాలో స్కెచ్.. పగతో 10 ఏళ్ల తర్వాత హత్య.. అసలేం జరిగిందంటే..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభా కార్యకలాపాలను ధన్‌ఖర్ బాగానే నిర్వహించారు. ఎంపీలతో కూడా సమావేశం అయ్యారు. అయితే సాయంత్రానికి ఊహించని షాకిచ్చారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయా పార్టీలు షాక్‌కు గురయ్యారు. ఇంత సడన్‌గా రాజీనామా చేయడమేంటి? అని చర్చ నడిచింది.

ఇది కూడా చదవండి: Asim Munir: అసిమ్ మునీర్.. మరో ముషారఫ్ కానున్నారా?.. పాక్‌లో ఏం జరుగుతోంది?

అయితే ధన్‌ఖర్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో బలమైన కారణంతోనే రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పార్టీ పెద్దలు అవమానించడం వల్లే ఇంత వేగంగా ధన్‌ఖర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతిగా డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ నేత హరివంశ్ ఉపరాష్ట్రపతి అవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version