NTV Telugu Site icon

12 సెంట్రల్‌ వర్సిటీల వీసీల నియామ‌కానికి రాష్ట్రపతి ఆమోదం

President

President

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీల కొత్త వైస్‌ ఛాన్స్‌లర్ల నియ‌మానికి ఆమోద ముద్ర‌వేశారు భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్.. దీంతో, దేశ‌వ్యాప్తంగా ఉన్న 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు నూత‌న వీసీల‌ను నియ‌మించారు.. ఈ 12 వ‌ర్సిటీల వీసీల నియామ‌కంతో మొత్తం 22 సెంట్ర‌ల్ వ‌ర్సిటీల్లో వీసీల భ‌ర్తీ పూర్తి అయ్యాయి.. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ఈ 12 యూనివ‌ర్సిటీల‌కు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. కొత్త‌ వీసీల‌ను నియ‌మిస్తూ ఉత్వర్వులు వ‌చ్చేశాయి.. ఇక‌, ఈ నియ‌మ‌కాల్లో భాగంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా డా.బీజే రావును నియ‌మించారు.