బీజేపీ కారణంగా హీరోయిన్ ప్రీతి జింటాకు చెందిన రూ.18 కోట్ల బ్యాంక్ రుణం రద్దైందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవలే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ మూసేశారు. దీంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారు. అయితే బీజేపీ వల్లే ప్రీతి జింటా లబ్ధిపొందారంటూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ ట్విట్టర్‌గా ఆరోపించింది. అంతేకాకుండా ఆమె కారణంగా బాధితులు రోడ్డున పడ్డారని తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: లోకేష్ కౌంటర్ ఎటాక్.. అవి మీకు అలవాడు.. మాకు కాదు..!
కాంగ్రెస్ ఆరోపణలకు ప్రీతి జింటా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండించారు. తాను సోషల్ మీడియా ఖాతాలు బీజేపీకి అప్పగించడం వల్ల లబ్ధిపొందినట్లు ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. తన ఖాతాలను తానే సొంతంగానే నిర్వహించుకుంటానని, ఎవరికీ ఇవ్వలేదని, ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 10 ఏళ్ల క్రితమే బ్యాంకు నుంచి తాను తీసుకొన్న రుణాన్ని తీర్చేశానని ఆమె వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయొద్దని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?