Site icon NTV Telugu

Pregnant Woman Carried On JCB: జేసీబీయే అంబులెన్స్‌గా మారింది.. ఆస్పత్రికి గర్భిణి తరలింపు

Jcb

Jcb

భారీ వర్షాలతో దేశంలోని చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి.. వరదలతో అతలాకుతలమైన మధ్యప్రదేశ్ జిల్లాలోలో ఓ గర్బిణిని ఆస్పత్రికి తరలిచేందుకు.. జేసీబీయే అంబులెన్స్‌గా మారిపోయింది.. మధ్యప్రదేశ్‌లోని నీమాచ్ జిల్లాలో భారీ వరదల కారణంగా.. గర్బిణి ఇంటకి అంబులెన్స్ చేరుకోవడం కష్టంగా మారింది.. దీంతో.. గర్భిణీ స్త్రీని జేసీబీలో తరలించారు.. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక యంత్రాంగం, పోలీసులు జేసీబీని ఏర్పాటు చేశారు.. కాగా, భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.. నీముచ్ జిల్లాలోని రావత్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also: 5G services: అక్టోబ‌ర్ నాటికి అందుబాటులోకి 5జీ సేవ‌లు.. కేంద్ర మంత్రి ప్రకటన

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులోని రేవా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వర్షానికి రోడ్లు దెబ్బతిన్న కారణంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి చేరుకోవడం ఆలస్యం కావడంతో మహిళ.. ఆటో రిక్షాలో బిడ్డను ప్రసవించింది. గత రెండు రోజుల్లో 4,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు.. భోపాల్‌తో సహా మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని మరియు ఇతర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మొత్తంగా… గర్బిణికోసం జేసీబీ.. అంబులెన్స్‌గా మారిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Exit mobile version