Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ను నియమించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ టాప్ పోలీస్ ఆఫీసర్ రెండేళ్ల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాన మంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన ఉన్నతస్థాయి కమిటీ టాప్ కాప్ పేరును ఖరారు చేసింది. కర్ణాటక కేడర్ కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైశ్వాల్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Leopard Attack: రెండేళ్ల చిన్నారిని చంపిన చిరుత.. వారంతో వ్యవధిలో మూడో ఘటన
సీబీఐ డైరెక్టర్‌ను ప్రధానమంత్రి, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ రెండేళ్లపాటు నిర్ణీత కాలవ్యవధికి ఎంపిక చేస్తుంది. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడగించవచ్చు. సీబీఐ డైరెక్టర్ పదవి కోసం ముగ్గుర సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేయగా.. చివరకు ప్రవీణ్ సూద్ ను నియమించింది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రవీణ్ సూద్ వార్తల్లో నిలిచారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, ప్రవీణ్ సూద్ పై సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని రక్షిస్తున్నారంటూ సూద్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలపై డీజీపీ ప్రవీణ్ సూద్ అక్రమ కేసులు పెడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.