Prashant Kishor comments on bihar politics: బీహార్ రాష్ట్ర రాజకీయాలపై, నితీష్ కుమార్- ఆర్జేడీ కూటమి, 2024 ఎన్నికలకై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాలలో ఇప్పడు స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013-14 నుంచి బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు ఇది ఆరోసారి అని.. గత 10 ఏళ్ల నుంచి బీహార్ లో రాజకీయ అస్థిరత నెలకొందని ఆయన అన్నారు. రాజకీయ, పరిపాలన అంచానాలు నేరవేరనప్పుడు కూటములు మారుతాయని ఆయన అన్నారు.
బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ కీలకం అని.. కొత్త కూటమిపై ఆయన గట్టిగా నిలబడతారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే కొత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా పనిచేస్తుందా.. లేదా అనేది చూడాలని.. వారి పాలన కొన్ని రోజుల్లో తెలిసిపోతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం బీహార్ లో తేజస్వీయాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది.. జేడీయూ- ఆర్జేడీ కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు.
రాబోయే కొాద్ది నెల్లలో బీహార్ లోని మహా ఘటబంధన్ 2.0 ఎలా పనిచేస్తుందనేది 2024 ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తుందని.. ప్రశాంత్ కిషోర్ అన్నారు. గతంలో జేడీయూ పార్టీలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత పార్టీ నుంచి వైదొలిగారు. ఇదిలా ఉంటే జేడీయూ-ఆర్జేడీ కూటమి ఈ రోజు అధికారం చేపట్టనుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
