Site icon NTV Telugu

Prashant Bhushan: ‘‘ఆప్ పతనం ప్రారంభమైంది..’’ ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు..

Prashant Bhushan

Prashant Bhushan

Prashant Bhushan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో సహా కీలక నేతలైన మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేందర్ జైన్ వంటి వారు కూడా ఓడిపోయారు. కీలక నేతల్లో కేవలం అతిశీ మార్లేనా మాత్రమే విజయం సాధించారు. బీజేపీ, ఆప్‌ని ఒక విధంగా ఉడ్చేసిందని చెప్పొచ్చు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 బీజేపీ గెలుచుకోగా, ఆప్ 22 చోట్ల మాత్రమే విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు, ఇండియా అగైనిస్ట్ కరెప్షన్ ఉద్యమంలో పాల్గొన్న ప్రశాంత్ భూషన్ కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. ఆప్ ఓటమికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, పారదర్శకతకు ప్రజాస్వామ్య వేదికగా ఏర్పాటు చేసిన ఆప్‌ స్వభావాన్ని కేజ్రీవాల్ మార్చారని ఆరోపించారు. లోక్‌పాల్‌ని అనుసరించలేదని, సుప్రీం లీడర్‌గా వ్యవహరించాలని దుయ్యబట్టారు. ఆయన కోసం రూ. 45 కోట్ల శీష్ మహల్ నిర్మించుకున్నారని అన్నారు. “ప్రచారం, ప్రగల్భాలు ద్వారా రాజకీయాలు చేయవచ్చని ఆయన (కేజ్రీవాల్) భావించారు. ఇది ఆప్ ముగింపుకు నాంది” అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.

Read Also: Shraddha Walker: శ్రద్ధా వాకర్ తండ్రి మృతి.. చివరి శ్వాస వరకు అందని అస్థికలు..

కేజ్రీవాల్‌కి 10 క్రితం తాను రాసిన లేఖని ప్రశాంత్ భూష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆప్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతూ, ప్రశాంత్ భూషన్, యోగేంద్ర యాదవ్‌లపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో ప్రశాంత్ భూషన్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ రాసిన లేఖని పంచుకున్నారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మీరు ఉత్తమ లక్షణాలు చూపించాలి. కానీ, దురదృష్టవశాత్తు మీ చెత్త లక్షణాలు బయటపడ్డాయి. లోక్‌పాల్ తొలగింపు, మమ్మల్ని బహిష్కరించడం , రష్యా కమ్యూనిస్ట్ పార్టీలోని అసమ్మతివాదులను స్టాలిన్ ప్రక్షాళన చేసిన విధానాన్ని గుర్తుకు తెస్తుంది. మీరు పార్టీకి చేస్తున్న పనిని దేవుడు, చరిత్ర క్షమించవు’’ అని ఆయన రాశారు.
2015లో ప్రశాంత్ భూషణ్‌ని పార్టీ నుంచి బహిష్కరించిన సమయంలో కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ.. పరిమితులు దాటారని, కుట్రలు పన్నారని ఆరోపించారు.

Exit mobile version