NTV Telugu Site icon

Prank Goes Wrong: ప్రాంక్ ప్రాణాలు తీసింది.. మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్..

Prank Goes Wrong

Prank Goes Wrong

Prank Goes Wrong: స్నేహితుడితో సరదా కోసం చేసిన పని మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన ముంబైలో మంగళవారం జరిగింది. మూడో అంతస్తులో గోడపై కూర్చున్న మహిళను ఆటపట్టిద్దామని చూసిన వ్యక్తి, ఆ మహిళను నెట్టివేయడం వీడియోలో చూడొచ్చు. వెంటనే పట్టు కోల్పోయిన మహిళ అక్కడ నుంచి జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read Also: Kerala: విదేశీ మహిళకు పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వివాదాస్పదమైన ఘటన..

చనిపోయిన బాధిత మహిళను నాగినా దేవీ మంజీరామ్‌గా గుర్తించారు. ఆమె మూడో ఫ్లోర్ నుంచి పడిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళ గ్లోబ్ స్టేట్ కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తోంది. ఆమె సహోద్యోగుల బృందంతో పాటు నాగినా దేశి కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఆ సమయంలో లాబీలోని బాల్కానీ గోడపై ఆమె కూర్చుని ఉంది. ఆ సమయంలో బంటీ అనే వ్యక్తి తమాషాగా నెట్టివేస్తున్నట్లు ప్రాంక్ చేద్దామని చూశాడు. అయితే, దురదృష్టవశాత్తు మహిళ అక్కడ నుంచి పడిపోయింది, పడిపోతున్న క్రమంలో ఆమెను బంటీ పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Show comments