Site icon NTV Telugu

Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభం ‘‘డ్యాన్స్’’ ఈవెంట్.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ‘‘నాచ్ గానా( సాంగ్స్-డ్యాన్స్)’’ కార్యక్రమం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది. రాహుల్ గాంధీ ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే దమ్ము ఉందా.?? అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. ‘‘రాహుల్ కుటుంబం రాముడి ఉనికిని, రామమందిరాన్ని తిరస్కరించింది. అతని ప్రభుత్వం హిందువులపై భీభత్సాన్ని సృష్టించింది. ఇప్పుడు అతను ద్వారకా పూజను నాటకంగా అభివర్ణించాడు.’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Read Also: Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ కన్ఫార్మ్..

రామమందిర నిర్వాహకులు అట్టడుగు వర్గాలకు చెందినవారి కన్నా ప్రముఖులకు ఆహ్వానాలు అందించడానికే ప్రాధాన్యత ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ నేత హిందువుల్ని పదేపదే అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘చాలా మంది సెలబ్రెటీలను ఆహ్వానించారు, అమితాబ్ బచ్చన్, అదానీ, అంబానీలకు ఫోన్ చేశారు. కానీ ఒక్క కూలీని కూడా పిలవలేదు. ఎవరైనా రైతు, కూలీని చూశారా..? అక్కడ డ్యాన్స్ జరుగుతోంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి హెజజాద్ పూనావాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకుని నమ్ముతోందని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలపై ఎంపీ మాణికం ఠాగూర్ మద్దతు తెలిపారు. ప్రధాన వేదిక వద్ద బాలీవుడ్ తారలు, భారతదేశంలో అత్యంత సంపన్నులు ఉణ్నారని, అయోధ్య ప్రజలు బయట వేచి ఉన్నారని ఠాగూర్ అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని చెప్పారని కాంగ్రెస్ మద్దతు తెలిపింది.

Exit mobile version