హసన్ మాజీ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. పని మనిషిపై అత్యాచారం కేసులో గతేడాది ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు. కొద్ది కాలంలోనే ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. గత వారం ఆయనకు జీవిత ఖైదీ పడింది.
ఇది కూడా చదవండి: KA. Paul: ట్రంప్ అమెరికాను నాశనం చేస్తున్నారు.. భారత్‌ను బెదిరిస్తే ఊరుకోను
అయితే ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష పడడానికి ఒకే ఒక్క ఆధారం చీర. ఫామ్‌హౌస్‌లో దాచిన చీర కారణంగానే అతడికి శిక్ష పడేలా చేసింది. చీరపై ఉన్న కీలకమైన ఆధారాన్ని ఫోరెన్సిక్ నిర్ధారించింది. దీంతో అతడు దోషిగా తేలాడు. లేదంటే ఈ కేసు మరుగున పడిపోయేది. 47 ఏళ్ల ఇంటి పనిమనిషిపై పలుమార్లు రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆమె చీరపై స్పెర్మ్ ఉండడంతో ఇదే కీలక ఆధారంగా లభించింది. దీంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ. 11 లక్షల జరిమానాను న్యాయస్థానం విధించింది.
ఇది కూడా చదవండి: MLA Kova Laxmi: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే!
ప్రజ్వల్ రేవణ్ణ పలుమార్లు అత్యాచారం చేయడంతో పని మనిషి చీరపై స్పెర్మ్ పడింది. దానిని ఫామ్‌హౌస్‌లో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ దాన్ని ఒక అటకపై భద్రంగా దాచి పెట్టాడు. ఎవరూ గుర్తించలేరని భ్రమపడ్డాడు. కానీ అదే పోలీసులకు ఆధారం అయింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌కు పంపిన తర్వాత నిర్ధారణ అయింది. అలా ప్రజ్వల్ బుక్కైపోయాడు. లేదంటే ఈ కేసు కనుమరుగైపోయేది.
దర్యాప్తు సమయంలో బాధితురాలు వాంగ్మూలం ఇస్తూ.. ప్రజ్వల్ తన చీరను ఇవ్వలేదని.. ఫామ్‌హౌస్‌లోనే దాచి పెట్టాడని చెప్పింది. ఇప్పటికీ అక్కడే ఉండొచ్చని తెలిపింది. మొత్తానికి పోలీసులు కనుక్కొని ల్యాబ్‌కు పంపించారు. చివరికి వీర్యం రేవణ్ణదిగా తేలడంతో జీవిత ఖైదు పడింది.
