Site icon NTV Telugu

PRAHAAR: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్రం

Prahaar

Prahaar

దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీని నిర్మూలనకు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో హోం మంత్రిత్వ శాఖ కొత్త ఆవిష్కరణ చేసింది. ఉగ్రవాదానికి మతం, జాతీయత లేదా సమాజం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సమర్థించదని.. జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని వెల్లడించింది.

‘‘ప్రహార్’’ ద్వారా ఉగ్రవాదం నివారణ, సత్వర ప్రతిస్పందన, సంస్థల మధ్య సమన్వయం, చట్టాన్ని కఠినంగా పాటించడం ద్వారా ఆధునిక ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడానికి ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రహార్ లక్ష్యం ఇదే..
దాడులు జరగకముందే నివారించడం
కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం
చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ మానవ హక్కులను కాపాడడం
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను తగ్గించడం
అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేయడం
హైటెక్ ముప్పులను ఎదుర్కోవడం
దాడులకు డ్రోన్లు, డిజిటల్ సాధనాల వినియోగం

ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. మార్చి 31 డెడ్‌లైన్. ఆలోపే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేస్తున్నారు.

Exit mobile version