NTV Telugu Site icon

Plane Hijackings: ఇండియాలో 16 విమాన హైజాక్ సంఘటనలు.. ఉగ్రవాదులు, రామ మందిరం, ఖలిస్తాన్ ఇలా ఎన్నో కారణాలు..

Plane Hijackings

Plane Hijackings

Plane Hijackings: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ వల్ల ఇప్పుడున్న తరానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 1999లో హైజాక్ ఘటన గురించి తెలుస్తోంది. దీనిపై వచ్చిన వివాదాల సంగతి ఎలా ఉన్నా, అప్పుడు జరిగిన పరిణామాల గురించి తెలుసుకోగలిగారు. అయితే, భారతదేశంలో ఇప్పటి వరకు 16 సార్లు విమానాల హైజాక్ జరిగింది. అయితే, ఆ కాలంలో దేశంలో ఉన్న ఒకే ఒక్క ఎయిర్ లైన్ సంస్థ ‘‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’’ ఈ హైజాకింగ్ ఘటనల్ని ఎదుర్కొంది.

చిన్నవి పెద్దవి కలిపి హైజాకింగ్ ఘటనల్లో ఉగ్రవాదుల విడుదల, ఖలిస్తాన్, రామ మందిరంతో పాటు చివరకు పరీక్షలను రద్దు చేయాలనే సిల్లీ కారణంతో కూడా విమానాలను హైజాక్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

1999 IC 814 హైజాకింగ్:

అన్ని హైజాకింగ్ ఘటనల్లో 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ IC 814 హైజాక్ ఇండియాకు పీడకలని మిగిల్చింది. ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న విమానాన్ని పాకిస్తాన్‌ హర్కత్ ఉల్ ముజాహీదీన్‌కి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి, అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ తరలించారు. ఈ హైజాక్‌లో ప్రయాణికుల్ని రక్షించేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇందులో ఒకరు జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నాడు. ఇతనే ఆ తర్వాత పార్లమెంట్, ముంబై, ఉరీ, పుల్వామా దాడులకు కారణమయ్యాడు.

1978లో ఇండియా గాంధీ విడుదల, పీఎం మొరార్జీ దేశాయ్ రాజీనామా కోసం:

డిసెంబర్ 20, 1978న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 410ని కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్తుండగా హైజాక్‌కి గురైంది. హైజాకర్లు భోలానాథ్ పాండే, దేవేంద్ర పాండేలు విమానాన్ని హైజాక్ చేశారు. వీరిద్దరికి యూత్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నా్యి. 1977లో మార్చిలో జనతా పార్టీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీలపై కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ కాబడిన ఇందిరా గాంధీని విడుదల చేయడంతో పాటు, ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

C 410ని నేపాల్ లేదా బంగ్లాదేశ్‌కు మళ్లించాలని హైజాకర్లు డిమాండ్ చేసినప్పటికీ అది తిరస్కరించబడింది. చివరకు విమానం వారణాసిలో ల్యాండ్ అయింది. అప్పటి యూపీ సీఎం జనతా పార్టీకి చెందిన రామ్ నరేష్ యాదవ్ సుదీర్ఘ మంతనాలు జరిగిన తర్వాత ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా హైజాకర్లు లొంగిపోయారు.

Read Also: Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’

1993 లో రామమందిరం కోసం హైజాక్:

డిసెంబర్ 6, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత, దేశవ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య అల్లర్లతో ఒక గంభీరమైన వాతావరణం నెలకొంది. బాబ్రీ సంఘటన జరిగిన నెల తర్వాత, జనవరి 1993లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 810 హైజాక్‌కి గురైంది. హిందూ రాడికల్ సతీష్ చంద్ర పాండే లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేశాడు. 22 ఏళ్ల వ్యక్తి బాబ్రీ ఘటనలో అరెస్టైన కరసేవకులను విడుదల చేయాలని, రామమందిరాన్ని నిర్మించాలని కోరారు. చివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి మాట్లాడటంతో హైజాకర్ సతీష్ చంద్ర లొంగిపోయారు. అతడికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయేలా 1993 హైజాక్:

రామమందిరం కోసం హైజాక్ జరిగిన కొన్ని రోజులకే మరోక హైజాకింగ్ ఘటన జరిగింది. ఈసారి దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయేందుకు హైజాక్ జరిగింది. ఈ అల్లర్లలో 1000 మంది చనిపోయారు. మార్చి 27న హర్యానాకి చెందిన ట్రక్ డ్రైవర్ హరిసింగ్ ఢిల్లీ నుంచి మద్రాస్ వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 439ని హైజాక్ చేశాడు. తాన వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించాడు. చివరకు అది హెయిర్ డ్రైవర్ అని తేలింది. హైజాకర్ పాకిస్తాన్‌లో రాజకీయ ఆశ్రయం కూడా కోరాడు.

పాకిస్తాన్ గగనతలంతోకి వెళ్లాలని కోరినప్పటికీ, అమృత్‌సర్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. చివరకు లొంగిపోయే ముందు భారతీయ మీడియాతో అల్లర్లకు సంబంధించి తన మనోవేధనను పంచుకున్నారు.

Read Also: Sanjay Singh: “ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్.. దేశద్రోహం కేసు నమోదు చేయాలి”..వినేష్-బజరంగ్ పై రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు ఫైర్

1993లో, పరీక్షల వాయిదా కోసం హైజాక్:

పరీక్షలు వాయిదా వేసేందుకు కూడా విమానం హైజాక్ జరిగిన ఘటన గురించి చాలా మందికి తెలియదు. లక్నోలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని లక్నో నుండి ఢిల్లీకి తీసుకెళ్లారు. పేలుడు పదార్థాలు ఉన్నాయని, మండే స్వభావం కలిగిన ద్రవ బాటిల్‌తో ఆయుధాలు ధరించారు. విద్యార్థులు కళాశాల కోర్సుల్లో మార్పులు చేయాలని, ఒక ప్రొఫెసర్‌కి ఇచ్చిన అవార్డుని రద్దు చేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. చర్చలు జరుతున్నంత సేపు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది.

చివరకు ప్రయాణికులు వారిని లొంగదీసుకోవడంతో హైజాకింగ్ డ్రామా ముగిసింది. డిమాండ్లు చాలా విచిత్రంగా ఉన్నాయని విమానంలోనే ఉన్న ఇజ్రాయిల్ జర్నలిస్ట్ టామ్ సెగెవ్‌తో సహా చాలా మంది అది హైజాక్ కన్నా ‘‘ఆట’’లాగా భావించారని చెప్పారు.

Read Also: TPCC Chief: ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తా..

1982 ఖలిస్తాన్ కోసం హైజాక్:

ఆగస్టు 4, 1982న బంగ్లాదేశ్‌లోని కొన్ని గురుద్వారాలను చూసుకునే గురుభక్ష్ సింగ్, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేశాడు. ప్రభుత్వం చేతుల్లో సిక్కులు అణిచివేతను అనుభవిస్తున్నారని హైజాక్‌కి పాల్పడ్డాడు. ముందుగా ఫ్లైట్‌ని లాహోర్ తీసుకెళ్లాలని భావించినా, చివరకు అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. బాంబు అని బెదిరించింది చివరకు గుడ్డతో చేసిన నకిలీ బంతి అని తేలింది.

అమృత్‌సర్‌లో దిగిన తర్వాత, గుర్బక్ష్ సింగ్ సిక్కు నాయకుడు హర్‌చంద్ సింగ్ లాంగోవాల్ మరియు ఖలిస్తానీ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే సమక్షంలో మాత్రమే చర్చలు జరుపుతానని పట్టుబట్టాడు. అయితే, అతను చివరికి శిరోమణి అకాలీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ మజితా సమక్షంలో లొంగిపోయాడు. ఆ తర్వాత, 70 మంది విదేశీయులతో సహా ప్రయాణికులు మరియు సిబ్బందిని విమానం నుండి సురక్షితంగా బయటపడ్డారు.

కేవలం వారాల తర్వాత మరో ఖలిస్తానీ తీవ్రవాది మంజిత్ సింగ్ బొంబాయి-ఢిల్లీ విమానం IC 492 737ను హైజాక్ చేశాడు. పిస్టల్, గ్రెనేడ్స్ కలిగి ఉన్న 30 ఏళ్ల మంజిత్ సింగ్ అమ‌ృత్‌సర్‌లో ఎలక్ట్రీషియన్. ఇతను ముసీబత్ సింగ్ అనే మారుపేరుతో హైజాక్‌కి పాల్పడ్డాడు. పంజాబ్‌లో అధికారాన్ని అకాలీదళ్‌కి బదిలీ చేయాలని, ప్రకాష్ సింగ్ బాదల్‌ని సీఎం చేయాలని, ఖలిస్తానీ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సిక్కు గ్రాంథీలను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విమానాన్ని లాహోర్ తీసుకెళ్లాలని డిమాండ్ చేసినప్పటికీ, తక్కువ ఇంధనం కారణంగా అమృత్‌సర్‌లో దిగింది. మంజిత్ సింగ్‌ని కాల్చి చంపి, హైజాకింగ్‌కి భద్రతా సిబ్బంది ముగింపు పలికింది.

Show comments