Site icon NTV Telugu

Congress: రెండు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్..! రేపే రెబల్స్‌ భేటీ..

వరుస పరాజయాలు కాంగ్రెస్‌ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. కాంగ్రెస్‌ పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం సోనియా గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తుండగా… పార్టీలో సమూల సంస్కరణలు జరగాల్సిందేనని మరో వర్గం వాదిస్తోంది. ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఏమీ తేల్చలేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా ఉండాలని తాత్కాలికంగా తీర్మానించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మరికొందరు నేతలన్నారు. పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక… మరోసారి CWC మీటింగ్ జరగనుంది. ఇక బుధవారం నాడు కాంగ్రెస్‌ లో రెబెల్ గా పేరు పడ్డ జీ23 నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, శశిథరూర్‌ లాంటి నేతలు మీటింగ్ కు రానున్నారు. ఇప్పటివరకు జీ23లో ఉన్నవారే కాకుండా మరికొందరు నేతలు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత సంస్కరణలు అవసరమని 2020 ఆగస్ట్‌లోనే జీ23 నేతలు హైకమాండ్ కు లెటర్ రాశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దారుణ ఓటమితో బుధవారం నాటి మీటింగ్ హాట్ హాట్ గా సాగనుంది సమాచారం.

Read Also: AP: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. రేపు వారి ఖాతాల్లోకి సొమ్ము

ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకుని ఇతరులకు అవకాశమివ్వాలన్నారు సీనియర్ నేత కపిల్ సిబల్. తాను అందరి కాంగ్రెస్‌ కావాలని కోరుకుంటున్నానని… కొందరు మాత్రం ఒక ఇంటి కాంగ్రెస్‌ కావాలనుకుంటున్నారని చెప్పారు. అయితే సిబల్‌ కు కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ మానిక్కం ఠాగూర్. కాంగ్రెస్‌ ను చంపేసి… ఇండియా అనేయ ఐడియాను ధ్వంసం చేసేందుకే కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబం వైదొలగాలని ఆర్ఎస్ఎస్-బీజేపీ కుట్ర చేస్తున్నాయన్నారు. అదే వైఖరితో కపిల్ సిబల్ మాట్లాడారని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం కపిల్ సిబల్‌పై స్పందించేందుకు నిరాకరించారు. మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడాకుండా వెళ్లిపోయారు.

Exit mobile version