Site icon NTV Telugu

Railway Budget 2023: ఈ ఏడాది బడ్జెట్‌లో 400 వందే భారత్ రైళ్లు..!

Union Budget

Union Budget

Railway Budget 2023-24: కేంద్రప్రభుత్వం భారత రైల్వేలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లానే ఉద్దేశంతో ఆధునీకీకరిస్తోంది. ఇందులో భాగంగానే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 8 మార్గాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగుతు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది బడ్జెట్ లో మరిన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2023-24 అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపుల పెరుగుద ఉండే అవకాశం ఉంది.

2017 నుంచి యూనియన్ బడ్జెట్ లో భాగంగానే రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. 2023, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త రైళ్లు, రైల్వే ఛార్జీలు, కొత్త మార్గాల గురించి ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. గత బడ్జెట్ లో వచ్చే మూడేళ్లలో దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీంట్లో భాగంగానే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది కేంద్రం. ఈ ఏడాది బడ్జెట్ లో నెక్ట్స్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. 400 వందే భారత్ రైళ్లను బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్

ప్రధాన మార్గాల్లో రైళ్ల వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లు పెంచడానికి, రాజధాని, శతాబ్ధితో సహా ఉన్న అన్ని హై-స్పీడ్ రైళ్లను క్రమంగా భర్తీ చేయడంతో పాటు, 2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా దేశాలకు రైళ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తామని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఇదే జరిగితే 180 కిలోమీటర్ల లేదా అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న ఎనిమిది దేశాల సరసన భారత్ చేరుతుంది.

రాబోయే 25 ఏళ్లలో లక్ష కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ వేయాలని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉంది. రైళ్ల వేగాన్ని పెంచేందుకు ఇది సహకరిస్తుంది. 2023-24 బడ్జెట్ లో 7,000 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లను విద్యుద్దీకరించేందుకు రూ. 10 వేల కోట్లను కేటాయించే అవకాశం ఉంది.

Exit mobile version