బీహార్‌లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ గుండా వెళుతున్న పోర్‌బందర్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బోగీలో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. రైలులో ప్రయాణిస్తున్న ANM సహాయంతో..ఆ మహిళ పండండి శిశువుకు జన్మనిచ్చింది. దీంతో బోగీలో ఉన్న వారంతా.. హర్షధ్వానాలు చేశారు.
Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్
పూర్త వివరాల్లోకి వెళితే… వసీం అనే ప్రయాణికుడు గుజరాత్‌లోని జామ్‌నగర్ నుండి ముజఫర్‌పూర్‌కు గర్భవతి అయిన తన భార్యతో ప్రయాణిస్తున్నాడు. రైలు సమస్తిపూర్ డివిజన్‌లోని కుమార్‌బాగ్ స్టేషన్‌కు చేరుకుంటుండగా, వసీం భార్యకు అకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో.. ప్రయాణికులు వెంటనే రైలు సిబ్బందికి , కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ముజఫర్‌పూర్ CTTI ఇన్‌ఛార్జ్ రాకేష్ కుమార్ వెంటనే TTEలను అప్రమత్తం చేశారు. రైలులో విధుల్లో ఉన్న TTE బృందానికి సమాచారం అందించారు.
Read Also:Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా..
అదే రైలులో ప్రయాణిస్తున్న ANM సహాయంతో మహిళకు సుఖ ప్రసవం జరిగింది. శిశువు ఏడుపులు రైలు అంతటా ప్రతిధ్వనించిన వెంటనే..కంపార్ట్‌మెంట్ అంతా హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది.
