కోడిగుడ్లను దొంగతనం చేసిన పోలీసు… సోషల్ మీడియాలో వైరల్ 

దొంగలను  పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనం చేస్తూ దొరికిపోతే దానికంటే అవమానం ఏముంటుంది.  పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ టౌన్ లోని ఓ పోలీసు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు.  రోడ్డుపై పెట్టిన కోడిగుడ్ల బండి వద్దకు వెళ్లిన పోలీస్ అందులోనుంచి కొన్ని గుడ్లను తీసుకొని జేబులో వేసుకున్నాడు.  బండి డ్రైవర్ రాగానే తనకేమి తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు.  అయితే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో కోడిగుడ్ల దొంగతనానికి పాల్పడిన పోలీస్ ప్రీత్ పాల్ సింగ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.