Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డి.సుధాకర్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఆస్తి వివాదం కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్ మినిష్టర్ గా ఉన్న సుధాకర్ దళితులపై దాడి, మోసం, దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి, రియల్ ఎస్టేట్ డెవలపర్లు బెంగళూర్ యలహంక కు చేరుకుని వివాదాస్పద స్థలంలో ఉన్న ఆస్తులను కూల్చేందుకు ప్రయత్నించారు.
Read Also: Cancer: క్యాన్సర్ కణాలను చంపే కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు
మొత్తం 15 మహిళలతో సహా 40 మంది, జేసీబీలతో వచ్చినట్లు పోలీసుల ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు. జేసీబీలతో అక్కడి కట్టడాలను కూల్చేస్తున్న క్రమంలో దాన్ని అడ్దుకునేందుకు సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు, మరికొందరిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో కాంగ్రెస్ మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, మంత్రి డి. సుధాకర్, భాగ్యమ్మ మరో 35 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి.