NTV Telugu Site icon

Kalki Dham Temple: కల్కి ధామ్ ఆలయానికి ఈ రోజు ప్రధాని మోడీ శంకుస్థాపన..

Pm Modi

Pm Modi

Kalki Dham Temple: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. యూపీ అంతటా రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

Read Also: Arvind Kejriwal: ఈడీని మూసేస్తే బీజేపీ ఖాళీ.. శివరాజ్ సింగ్, వసుంధర రాజేలు సొంత పార్టీలు పెట్టుకుంటారు..

ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు శ్రీకల్కి ధామ్ శంకుస్థాపనకు రావడం మాకు గర్వకారణమని అన్నారు. ఈ రోజు ఉదయం 0.25 గంటలకు మోదీ సంభాల్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత ఆలయ గర్భగుడిలో ప్రధాన రాయిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కల్కీ ధామ్ గురువులు, మతపెద్దలు, ప్రముఖులు, భక్తులు హాజరవుతున్నారు. ప్రముఖ కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్లు మహమ్మద్ షమీ, సురేశ్ రైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.