PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జూన్ 04న సాయంత్రం 4.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతోంది. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్తాన్‌పై దాడి తర్వాత తొలిసారిగా ప్రధాని మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
ఇటీవల, సింగపూర్ పర్యటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. భారత్ కూడా కొన్ని ఫైటర్ జెట్స్‌ని కోల్పోయిందని చెప్పారు. భారత్ ప్రారంభంలో తప్పులు చేసిందని, వాటిని సరిదిద్దుకుని పాకిస్తాన్ లోపలికి వెళ్లి దాడులు చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాత మంత్రులతో సమావేశానికి పిలుపునివ్వడం గమనార్హం.
సీడీఎస్ వ్యా్ఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కేంద్రంలోన బీజేపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోడీ ఎన్నికల కోసం భారత సైన్యం పరాక్రమాన్ని తన వ్యక్తిగత క్రెడిట్ కోసం వాడుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. మరోవైపు, భారత్ -పాకిస్తాన్ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మధ్యవర్తిత్వం చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే, పాకిస్తాన్ డీజీఎంఓ మేరకే భారత్ కాల్పుల విమరణకు అంగీకరించిందని, దీంట్లో ఎవరి మధ్యవర్తిత్వం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
