NTV Telugu Site icon

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏడాది.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

Narendramodi

Narendramodi

Ram Mandir: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరి ఏడాది గడిచింది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నంగా రామమందిర ప్రాముఖ్యాన్ని కొనియాడారు. అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలనే సకల్ప సాధనలో ఈ దివ్యమైన, అద్భుతమైన రామాలయం గొప్ప ప్రేరణగా మారుతుందని ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Read Also: Transport Officer: ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తాం..

అయోధ్య రామమందిరా ప్రారంభోత్సవానికి ఏడాది కావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించే మూడు రోజుల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 11 నుండి 13 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో సంగీతం, కళా ప్రముఖులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లా విగ్రహానికి ఆచారబద్ధమైన ‘‘అభిషేకం’’తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత అంగద్ తీలాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

Show comments