PM Modi: ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ)కి చెందిన కీలక నేత మరియా ఆలం ఇటీవల ఓ మైనారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఓట్ జిహాద్’’కి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖర్షీద్ మేనకోడలైన మరియా ఆలం చేసి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు గుజరాత్ లోని ఆనంద్ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఆయన.. ‘‘ ఇండియా కూటమి ప్లాన్‌ని ఆ మహిళా నాయకురాలు బహిర్గతం చేసింది’’ అని అన్నారు. మరియా ఆలయం మాట్లాడుతూ, ముస్లింలు ఓట్ జిహాద్‌కి వెళ్లాలని, ఇండియా కూటమికి ఓటేయాలని కోరారు. ‘‘మదర్సా నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి కాదు, ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోంది. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచింది’’ అని ప్రధాని ఆరోపించారు.
Read Also: Prajwal Revanna Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను లీక్ చేసిన డ్రైవర్ మిస్సింగ్..
ఈ ప్రకటనను కాంగ్రెస్ నేతలు ఎవరూ వ్యతిరేకించలేరని ప్రధాని అన్నారు. ఒక వైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సాధారణ వర్గాలను విభజించేందుకు ప్రయత్నిస్తుంది, మరోవైపు ఓటు జిహాద్ నినాదాన్ని లేవనెత్తుతోంది, ఇవి వారి ఉద్దేశాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెబుతున్నాకయని ప్రధాని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో జరిగి ఓ ర్యాలీలో మరియా ఆలం మాట్లాడుతూ.. ముస్లిం ఓటర్లు ‘‘ఓటు జిహాద్’’ ప్రారంభించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఇది ఒక్కటే మార్గమని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు, కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై యూపీ పోలీసులు మారియా ఆలంతో పాటు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సల్మాన్ ఖుర్షీద్‌లపై వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే, సల్మాన్ ఖుర్షీద్ మాత్రం ఆమె వ్యాఖ్యన్ని సమర్థించారు.
