NTV Telugu Site icon

Gujarat Bridge Collapse: ఈ రోజు మోర్బీలో ప్రధాని పర్యటన.. ఆస్పత్రికి హుటాహుటిన రంగులు..

Gujarat Incident

Gujarat Incident

PM Narendra Modi visit to Morbi today: మోర్బీ వంతెన కూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 141 మంది మరణించారు. సమయం గడుస్తున్నా కొద్ధీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం అందర్ని కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు(మంగళవారం) ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అక్కడే ముఖ్యమంత్రి, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాని రూ. 2లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.

Read Also: Joe Biden: భారతీయులకు అండగా ఉంటాం.. మోర్బీ వంతెన ఘటనపై బైడెన్ సంతాపం

ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన నేపథ్యంలో లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆస్పత్రులకు రంగులు వేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీలోని సివిల్ం ఆస్పత్రికి రంగులు వేస్తున్న ఫోటోలను చూపిస్తూ.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆస్పత్రికి రంగులు వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. బీజేపీని విమర్శించింది. 141 మంది చనిపోయారు. వందలాది మంది తప్పిపోయారు, అసలు దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం ఫోటోషూట్ కు సిద్ధమయ్యే పనిలో నిమగ్నమయ్యారని ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆస్పత్రిలో టైల్స్ వేస్తున్న ఫోటోలును షేర్ చేసింది. ప్రధానిని ఉద్దేశిస్తూ.. వారికి సిగ్గు లేదు.. చాలా మంది చనిపోయారని..కానీ వారు ఓ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని విమర్శించింది. గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హేమంగ్ రావల్ మాట్లాడుతూ.. మోర్చిలోని సివిల్ ఆస్పత్రిలో పెయింటింగ్, డెకరేషన్ పనులు జరుగుతున్నాయని.. బీజేపీ కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుందని.. పెయింటింగ్, డెకరేషన్ బదులు బాధితులకు మంచి చికిత్స అందిచాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రిని సిద్ధం చేసేందుకు రాజ్ కోట్ నుంచి సిబ్బందిని తీసుకువచ్చారు. కలర్లతో పాటు, టైల్స్ వర్క్, కొత్త కూలర్లు, హస్పిటల్ బెడ్లను ఏర్పాటు చేశారు.