NTV Telugu Site icon

Varanasi Tent City: వారణాసిలో టెంట్ సిటీ.. ప్రారంభించిన ప్రధాని మోడీ

Varanasi Tent City

Varanasi Tent City

PM Narendra Modi Started Tent City In Varanasi: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. గంగా నది ఒడ్డున ఎంతో అందంగా నిర్మించిన ఈ సిటీని ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ప్రారంభించారు. గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో ఈ టెంట్ సిటీని నిర్మించారు. వారణాసి నుంచి రామ్ నగర్ వెళ్లే మార్గంలో ఇది కనిపిస్తుంది. ఇందులో ఒకే విడతలో 200 మంది ఉండగలిగే కెపాసిటీ ఉంది. ఈ టెంట్ సిటీలో గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలున్నాయి. వీటిల్లో చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ తదితర వసతులన్నీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్‌తో ఇంటీరియర్ డిజైన్ చేయడం విశేషం. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే.. రూ.12,000-14,000 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ టెంట్ సిటీ భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

Woman Harassment Case: భారత మహిళపై లైంగిక వేధింపులు.. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే?

అంతర్గత జలమార్గాలను మరింత అధునాతనం చేసి.. నదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఈ టెంట్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ టెంట్ సిటీలో బస చేయాలనుకునేవారు.. ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (UPSTDC) ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాటేజీల్లో సౌకర్యవంతమైన బస కోసం వాటర్‌ప్రూఫ్ టెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డీలక్స్ టెంట్ లోపల 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. భారీగా తరలివచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి సమస్య లేకుండా ఉండేందుకు ఈ టెంట్ సిటీకి ఏర్పాటు చేశారు. ఈ టెంట్ సిటీకి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. కాశీలో పర్యాటకానికి ఈ టెంట్ సిటీ పెద్ద ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Post Office Super RD Plan: ప్రతి నెల రూ.5వేల పెట్టుబడికి.. రూ.2లక్షల వడ్డీ వస్తుంది