NTV Telugu Site icon

Karmayogi Saptah: నేడు నేషనల్ లెర్నింగ్ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Modi

Modi

Karmayogi Saptah: ఈరోజు (శనివారం) దేశ రాజధానిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ లెర్నింగ్ వీక్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. పౌర సేవకులకు వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యాల అభివృద్ధికి సరికొత్త ప్రోత్సాహాన్ని అందించడానికి ఉద్దేశించినది. మిషన్ కర్మయోగిని సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడింది.. అప్పటి నుంచి ఇది గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను ప్రజలతో పంచుకోనున్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అలాగే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారంలో నాలుగు గంటల పాటు విద్యార్హతకు సంబంధిత విద్యను పొందడం తప్పనిసరి చేస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిర్దిష్ట సామర్థ్యాలను పెంపొందించడానికి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లను నిర్వహిస్తాయి. ఈ కొత్త నిబద్ధత దేశ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని మోడీ సర్కార్ భావిస్తుంది. జాతీయ లక్ష్యాలతో అన్నింటినీ సమం చేయడంతో పాటు జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే, ప్రతి కర్మయోగి జాతీయ అభ్యాస వారోత్సవ కార్యక్రమంలో కనీసం నాలుగు గంటల పాటు సామర్థ్య ఆధారిత విద్య లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక, ఈ మిషన్ కర్మయోగిని సెప్టెంబర్ 2020లో ప్రారంభించారు.