భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. పౌరులకు అభినందనలు తెలియజేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న అందరికీ ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు కోవిడ్-19కి పూర్తిగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలియజేసిన తర్వాత ప్రధానమంత్రి అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు.
Read Also: విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాల్సిందే.. చిరంజీవి, పవన్ స్పందించాలి..
కాగా, భారతదేశం తన వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సిన్ యొక్క రెండు డోసుల టీకాలు వేశాం.. కరోనాపై పోరాటంలో మేం మరింత బలపడుతున్నాం… ఇక, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోండి అంటూ కేంద్రమంత్రి మాండవ్య ట్వీట్ చేశారు.. ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం మరియు డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్‌మెంట్ కేటగిరీ ద్వారా 164.36 కోట్ల (1,64,36,66,725) కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు అందించినట్లు సమాచారం. 12.43 కోట్ల కంటే ఎక్కువ (12,43,49,361) బ్యాలెన్స్ మరియు ఉపయోగించని వ్యాక్సిన్ డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల దగ్గర ఉన్నాయి.. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైన విషయం తెలిసిందే.
