NTV Telugu Site icon

Uniform Civil Code: భారతదేశం అంతటా ఒకే సివిల్ కోడ్.. ఇది మోడీ హామీ..

Modi, Amit Shah

Modi, Amit Shah

Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఇది ప్రధాని నరేంద్రమోడీ హామీ అని అన్నారు. కాంగ్రెస్ వ్యక్తిగత ప్రయోజనాలను సమర్థిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ గుణ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Read Also: CM Revanth Reddy: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు.. హరీష్ కు రేవంత్ కౌంటర్…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. రాహుల్ బాబా బుజ్జగింపు కోసం ఏమైనా చేసుకోవచ్చు, బీజేపీ ఉన్నంత వరకు వ్యక్తిగత చట్టాలను అనుమతించబోము, ఇది మా వాగ్దానం, మోడీజీ హామీని అమలు చేస్తారు. మేము ఉత్తరాఖండ్‌లో చేసిన విధంగా దేశం మొత్తం యూసీసీని అమలు చేస్తామని అన్నారు. దేశంలో మావోయిస్టు, ఉగ్రవాదాన్ని మోడీ ప్రభుత్వం అంతం చేసిందని అన్నారు.

2019లో ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం ఒక్కదెబ్బతో రద్దు చేసిందని, రాహుల్ బాబా భయపడి రక్తం ఏరులైపారుతుందని అన్నారు, కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని గుర్తుంచుకోవాలి, ఇది మోడీ ప్రభుత్వం, రక్తం గురించి పక్కన పెడితే ఒక్క రాయి కూడా విసిరే ధైర్యం ఎవరూ చేయలేదు అని అమిత్ షా అన్నారు. ప్రభుత్వం దేశాన్ని ఉగ్రవాదం, మావోయిస్టు తీవ్రవాదం నుంచి విముక్తి చేసింది, వీటిని మధ్యప్రదేశ్ నుంచి తరిమికొట్టామని చెప్పారు.

Show comments