Site icon NTV Telugu

PM Modi: పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై మోడీ ఫిదా.. శభాష్ అంటూ ప్రధాని ట్వీట్

Modi

Modi

ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్‌లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అసలు ఓట్లు చోరీ చేసిందే కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. నెహ్రూ, ఇందిరాగాందీ, సోనియా గాంధీ వేర్వేరు సమయాల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా అమిత్ షా ప్రసంగించారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. అద్భుతంగా ప్రసంగించారంటూ ఎక్స్‌లో ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియపై నిర్దిష్ట వాస్తవాలను వివిధ కోణాల్లో తెలియజేశారని కొనియాడారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య బలాన్ని హైలైట్ చేయడమే కాకుండా ప్రతిపక్షాల అబద్ధాలను కూడా బట్టబయలు చేశారంటూ మోడీ అభినందించారు.

అమిత్ ప్రసంగం ఇదే..
స్వాతంత్ర్యం వచ్చాక ప్రధాని పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు 28 మంది మద్దతు తెల్పారని.. నెహ్రూకు కేవలం ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేశారని.. తీరా చూస్తే నెహ్రూనే ప్రధాని అయ్యారని.. దీని బట్టి అప్పుడే తొలి ఓటు చోరీ జరిగిందంటూ ఏకీపారేశారు. ఇక ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె ఎన్నికను న్యాయస్థానం రద్దు చేస్తే.. తనకు తానుగా చట్టపరమైన రక్షణ కల్పించుకున్నది వాస్తవం కాదా?.. ఇది రెండో చోరీ అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఇక సోనియాగాంధీ అసలు భారతీయ పౌరురాలు కాకముందే ఓటర్‌గా నమోదు కావడం మూడో ఓటు చోరీ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతూ కాంగ్రెస్ ప్రతీసారి ఈవీఎంలను ఆడిపోసుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు.

 

Exit mobile version