Site icon NTV Telugu

PM Modi: పెద్ద సంఖ్యలో ఓటేయాలి.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం..

Pm Modi

Pm Modi

PM Modi: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఓటర్లకు సందేశాన్ని పంపారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేసే ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ మరియు అస్సామీ భాషల్లో ఎక్స్ వేదికగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ముఖ్యమైనదని అన్నారు.

Read Also: Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..

‘‘2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి! 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున, ఈ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువకులు మరియు మొదటిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఓటు లెక్కించబడుతుంది మరియు ప్రతి వాయిస్ ముఖ్యమైనది!’’ అంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version